- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: సుజనా చౌదరి భేటీపై స్పష్టత ఇచ్చిన ఆలపాటి
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో తనకు మంచి సత్సంబంధాలున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా తెలిపారు. సుజనా చౌదరి తనను కలిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్మ హాస్టల్ 100 ఏళ్ల ఉత్సవాలకు సుజనాను ఆహ్వానించినట్లు తెలిపారు. అందకే టీకి రావాలని సుజనాను పిలిచినట్లు ఆలపాటి రాజా చెప్పారు. మూడు రాజధానులతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తామని సుజనా చెప్పారని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతామన్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అధికారాన్ని గుప్పెట పెట్టుకోవాలనుకుంటున్నారని ఆలపాటి ఆరోపించారు. అందరూ కలిసి పని చేయాలన్న భావన ఉందని ఆలపాటి రాజా పేర్కొన్నారు.
కాగా గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. అయితే మర్యాదపూర్వకంగా ఆలపాటి ఇంటికి వెళ్లినట్లు సుజనా చౌదరి తెలిపారు. ఇటీవల బీజేపీ నేత సత్యకుమార్ రాజుపై జరిగిన దాడిని సుజనా చౌదరి ఖండించారు. సత్యకుమార్‌పై వైసీపీ వాళ్లే దాడి చేశారని ఆరోపించారు. అందరూ ఏకంకావాల్సిన అవసరం ఉందని సుజనా చౌదరి పేర్కొన్నారు.