- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది దురుద్దేశం.. అందుకే కోర్టు కొట్టేసింది: చంద్రబాబు
X
దిశ, డైనమిక్ బ్యూరో: జీవో నంబర్ 1పై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దేశంలో అంతిమంగా గెలిచేది... నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమేనని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి...భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని తెలిపారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదన్నారు. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం జీ.ఓ. నెంబర్ 1ను తెచ్చిందని చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story