Womens Day సందర్భంగా చంద్రబాబు కీలక హామీ

by srinivas |   ( Updated:2023-03-08 13:59:50.0  )
Womens Day సందర్భంగా చంద్రబాబు కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో చెత్త పన్ను లేదని, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్లినా మహిళాలు ముందుగా చెన్ను పన్ను గురించే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వర్చువల్ విధానంలో ‘కనెక్ట్ ’ కార్యక్రమం

మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ‘కనెక్ట్’ అనే కార్యక్రమం నిర్వహించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారిత, భద్రత, విద్య, ప్రభుత్వ విధానాలు, సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు మహిళలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఏడుసార్లు విద్యుత్ ఛార్జిలు పెరిగాయి...

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ అసమర్థ పాలన వల్ల ఏడుసార్లు విద్యుత్ ఛార్జిలు పెంచాలని మండిపడ్డారు. వ్యక్తిగత ఆదాయం పెంచుకునేందుకు సీఎం జగన్ మద్యం రేట్లు పెంచారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మహిళలకు హామీ ఇచ్చిన ఇప్పుడు మాట తప్పాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed