27 ఏళ్ళపాటు టీడీపీ కోసం పని చేశా: సతీశ్ రెడ్డి

by srinivas |   ( Updated:2024-03-01 14:15:19.0  )
27 ఏళ్ళపాటు టీడీపీ కోసం పని చేశా: సతీశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్ళ టీడీపీ కోసం పనిచేసానని చెప్పారు. తన కష్టానికి చంద్రబాబు విలువ ఇవ్వలేదని తెలిపారు. వైసీపీ నుంచి పిలుపు వచ్చాక టీడీపీ నేతలు తనను కలిశారని తెలిపారు. కానీ తాను వైసీపీ‌లో చేరానన్నారు. జగన్ వెంటే ఉంటానని, ఆయన కోసమే పని చేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, సీఎం జగన్ ఏ బాధ్యత ఇచ్చిన పని చేస్తానని పేర్కొన్నారు. టీడీపీ అనేది ఒక వ్యాపార సంస్థగా మారిందని సతీశ్ విమర్శించారు.

Advertisement

Next Story