- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో చిలకలూరిపేట సభకు ప్రధాని మోడీ.. ప్రసంగంపైనే ఉత్కంఠ
దిశ, వెబ్ డెస్క్: మరికాసేపట్లో చిలకలూరుపేట సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కావడంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ నెలకొంది. 2014లోనూ ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రాష్ట్రానికి పలు హామీలు ప్రకటించారు. కొన్ని నెరవేరాయి. ఇంకొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ ఒక స్థానం కూడా గెలవలేకపోయింది. జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకుంది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు సాధించి ప్రభంజనం సృష్టించింది.
అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదని, అరాచకాలు సృష్టించారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ను గద్దె దించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే మూడు పార్టీలు ఒక్కటి కావాలని నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. చిలకలూరిపేటలో ఆదివారం ఉమ్మడి సభకు ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన హామీలపై ఎలాంటి ప్రసంగాలు చేస్తారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
Read More..