అమరావతిలో హైటెన్షన్... అమరాలింగేశ్వర ఆలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

by srinivas |   ( Updated:2023-04-08 11:36:00.0  )
అమరావతిలో హైటెన్షన్... అమరాలింగేశ్వర ఆలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఏదో ఒక సమస్యపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా అమరావతిలో ఇసుక తవ్వకాలపై ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య సవాళ్ల పర్వం సాగింది. దీంతో ఇద్దరు నేతలు సైతం చర్చకు సిద్ధమయ్యారు. ఇందుకు అమరలింగేశ్వర ఆలయం వద్ద ప్రమాణం లేదా బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంతాలు వాళ్లు అమరలింగేశ్వర ఆలయం వద్దకు రావద్దని ఆంక్షలు విధించారు. ఆలయం నాలుగు వైపులా బారికెడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులెవరూ కూడా స్థానికేతరులకు రూములు ఇవ్వొద్దని ఆదేశించారు. అలాగే పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పలువురు టీడీపీ నేతలు ముందుగానే ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story