వీఆర్వో మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఇల్లే నరకమైందా ?

by Rani Yarlagadda |
వీఆర్వో మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఇల్లే నరకమైందా ?
X

దిశ, పల్నాడు: ముప్పాళ్ల మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఆయన రాసిన సూసైడ్ నోట్ గురువారం బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

‘నా చావుకు ఎవరూ కారణం కాదు. ఇల్లు ఒక నరకంగా మారిపోయింది. ఏదో తెలియని మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను. అక్కా, బావా.. నన్ను క్షమించండి. ఈ జన్మకు ఇక సెలవు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, సూసైడ్ నోట్‌లో రాసిన అంశాల ఆధారంగా వాస్తవంగా మనస్తాపంతోనే ఇలా రాశాడా? లేదా ఇంకా ఏమైనా కారణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వోకు ఓ సహచర ఉద్యోగినితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అతని కాల్ డేటా సేకరించి ఎవరితో మాట్లాడుతున్నాడన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. తరుచూ శ్రీశైలం వెళ్లేవాడని తెలుసుకున్న పోలీసులు అతని ఆచూకీ గుర్తించడం కోసం ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించి గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed