Nara lokesh: మంగళగిరి బాధ్యతలపై సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2022-11-25 15:01:11.0  )
Nara lokesh: మంగళగిరి బాధ్యతలపై సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గం నేతలతో శుక్రవారం నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు అంతా సన్నద్ధం కావాలని లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించేందుకు కార్యకర్తలు మరింత కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మంగళగిరిలో గెలిచేందుకు ఎన్నో ఆయుధాలను ప్రయోగిస్తారని వాటన్నింటిని తిప్పి కొట్టాలని లోకేశ్ సూచించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంగళగిరిలో మాత్రం టీడీపీ జెండా ఎగరాల్సిందేనని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని లోకేశ్ హామీ ఇచ్చారు.

400రోజుల పాదయాత్ర

జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలని నారా లోకేశ్ స్పష్టం చేశారు. 400 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు కార్యకర్తలకు తెలియజేశారు. 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండబోతుందని తెలిపారు. సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో 4 రోజులపాటు పాదయాత్ర జరుగుతుందని ప్రకటించారు. ఇకపై మంగళగిరి బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలని నారా లోకేశ్ ఆదేశించారు.

READ MORE

Vijayasai Reddy ఫోన్ దొరకాలి.. శ్రీవారిని కోరుకున్న టీడీపీ మాజీ మంత్రి

Advertisement

Next Story

Most Viewed