- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababu: ఓటర్ లిస్ట్‌లో అక్రమాలపై ఆగ్రహం.. కార్యకర్తలకు కీలక సూచనలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటర్ లిస్టులో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో చాలా అక్రమాలకు పాల్పడుతుందని...దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చెప్పారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు.
చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము కోరామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్ల లిస్ట్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చామని నేతలు పార్టీ అధినేతకు వివరించారు.
వైసీపీ దొంగ ఓట్ల వంటి అక్రమాలకు పాల్పడుతూ ఆ బురదను తిరిగి టీడీపీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని...ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయాలని కోరారు. తద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే ఏ అధికారినీ వదిలేది లేదని చంద్రబాబు నాయుడు నేతలతో అన్నారు.