ఉదయాన్నే ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి.. తర్వాత జరిగేది ఇదే..!

by Kanadam.Hamsa lekha |
ఉదయాన్నే ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి.. తర్వాత జరిగేది ఇదే..!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ, చిన్న తప్పులతో అనారోగ్యం పాలవుతుంటారు. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడూ కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉండాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు ఉండే ఆహారం లేదా త్వరగా జీర్ణం అయ్యే ఫుడ్‌ను మాత్రమే తీసుకోవాలి. లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మార్నింగ్ టైమ్‌లో చాలామంది తియ్యటి పదార్థాలు లేదా పుల్లటి పదార్థాలు తింటుంటారు. అలా తినడం వల్ల అల్సర్, ఎసిడిటి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలను ఉదయంపూట తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.

కాఫీ, టీ: ఉదయాన్నే చాలామంది కాఫీ లేదా టీలను తాగుతుంటారు. బ్లాక్ కాఫీ, షుగర్ ఫ్రీ కాఫీ ఆరోగ్యానికి మంచిదే. కానీ, చక్కెర ఎక్కువగా వేసుకుని కాఫీ లేదా టీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ అనే పదార్థం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి, ఎసిడిటి, డయాబెటిస్‌కు కారణం అవుతుంది.

వేడి నీరు: జీర్ణశక్తి మెరుగురుపరుస్తుందని కొంతమంది ఉదయాన్నే వేడి నీరును తాగుతుంటారు. అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానికి బదులుగా గోరు వెచ్చని నీటిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పచ్చి కూరగాయలు: ఉదయాన్నే చాలామంది పచ్చి కూరగాయలు తింటుంటారు. అలా తినడం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఆహారం జీర్ణం కాకుండా అజీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్యాక్ చేసిన జ్యూస్‌: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆహారంలో భాగంగా చాలామంది జ్యూస్ తాగుతుంటారు. జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. కానీ, ముందుగా స్ట్రోర్ చేసిన జ్యూస్ తాగడం మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముందుగా ప్యాక్ చేసిన జ్యూస్‌లో కొన్ని రసాయనాలతో పాటుగా షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకున్నప్పటికీ.. ఈ జ్యూస్ తాగడం వల్ల అందులోని షుగర్ లెవల్స్ డయాబెటిస్‌కి కారణం కావొచ్చు.

చాకెట్లు: ఉదయాన్నే పొరపాటున కూడా చాకెట్లను తినకూడదు. వీటిలో ఉండే చక్కెర కంటెంట్‌లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ప్రతి రోజూ ఇలా చాకెట్లు తిన్నట్లైతే భవిష్యత్‌లో కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

స్పైసీ ఫుడ్: పరగడుపున చాలామంది బాగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తింటుంటారు. ఈ ఆహారం కడుపులో త్వరగా జీర్ణం కాదు. ఇది జీర్ణవ్యవస్థను పనితీరును దెబ్బతీస్తుంది. కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

అరటి పండు: ఉదయాన్నే పరగడుపున అరటి పండు తినడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది రక్తంపై ప్రభావం చూపుతుంది.

పెరుగు: ఉదయాన్నే పెరుగు తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. అంతేకాకుండా జలుబు, ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్, సోడాలు వంటివి కూడా ఉదయాన్నే తాగకూడదు. వాటి వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

సాసేజెస్ ఫుడ్: సాసేజెస్ లాంటి ప్రాసెస్డ్ మీట్‌ను ఉదయాన్నే తినకూడదు. ఎందుకంటే దీనిని నిల్వ చేయడానికి సోడియం వంటి ఉత్ప్రేరకాలు వాడుతారు. ఇలాంటివి తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed