- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSNL సర్వీసులపై వైసీపీ ఎంపీ కీలక ఆదేశాలు
దిశ, గుంటూరు: సమస్యలను పరిష్కారం చేసుకుని బీఎస్ఎన్ఎల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లేలా అధికారులు కృషి చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా 3వ టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మరిన్ని బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్‌లు నిర్మించాలని సూచించారు. అటు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని సైతం పెంచాలని ఆదేశించారు. అలాగే పల్నాడులో సిగ్నల్స్ పెరిగేలా మరింత దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. సిగ్నల్ సామర్థ్యం పెంచితేనే ప్రజలకు ఈ నెట్ వర్క్‌పై నమ్మకం కలుగుతుందన్నారు. సమస్యలు తెలిపితే కేంద్రం వద్ద తన వంతు కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 729 టవర్‌లలో 104 మాత్రమే 4జీ సర్వీస్‌గా ఉండటంపట్ల ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని టవర్‌లు 4జీగా మారేలా చూడాలని, అదనపు టవర్‌లు ఏర్పాటు ప్రణాళికలు అందించాలన్నారు. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ అభివృద్ధికి దేశ వ్యాప్తంగా రూ. 89 వేల కోట్లు మంజూరు చేసి ప్రోత్సాహం ఇస్తుంటే.. అధికారులు ఎందుకు అభివృద్ధి బాటలో ఉండటం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా నిధులు వాడుకొని బిఎస్ఎన్‌ఎల్‌ను అభివృద్ధి చేసుకుంటుంటే మనం మాత్రం వెనుకబాటులోనే ఉంటున్నామన్నారు. గ్రామాల్లో ఇళ్ల మధ్య టవర్ పెట్టడం ఇబ్బందిగా ఉంటే.. ప్రభుత్వ బిల్డింగులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, పీహెచ్‌సీ, స్కూల్స్ బిల్డింగ్లపై పెట్టాలని సూచించారు. అత్యంత త్వరగా అభివృద్ధి ప్రణాళిక పత్రాలను తనకి అందించాలని అధికారులను ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆదేశించారు.