Amaravati: సుమన్‌ను సన్మానించిన కొల్లు రవీంద్ర

by srinivas |
Amaravati: సుమన్‌ను సన్మానించిన కొల్లు రవీంద్ర
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ కలిశారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి, నారా లోకేశ్ ఘనవిజయాలు అందుకోవడం పట్ల సుమన్ అభినందనలు తెలిపారు. అమరావతి వచ్చిన సందర్భంగా సుమన్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కూడా కలిశారు. కల్తీ మద్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. తన చాంబర్‌కు వచ్చిన సుమన్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు. కాగా, సుమన్ చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. ఆయన బ్యాండేజ్‌తో కనిపించారు.

Advertisement

Next Story