- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పులిచింతల నిర్వాసితులకు "పట్టా"భిషేకం.
దిశ, సత్తెనపల్లి: దేశ సౌభాగ్యం కోసం నిర్మించే సాగునీటి ప్రాజెక్టులలో నిర్వాసితులదే ముఖ్య భాగస్వామ్యమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కేఎల్ రావు సాగర్ (పులిచింతల) నిర్వాసితులకు " రిజిస్ట్రేషన్ పత్రాల " పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిర్వాసితులకు ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించినా, నివాస స్థలాల హక్కు, రిజిస్ట్రేషన్ కల్పించడమే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దార్శనికతతో పులిచింతల నిర్మాణం పురుడు పోసుకుందని మంత్రి తెలిపారు.
రిజర్వాయర్ ప్రాంతంలో మునిగిపోయిన గ్రామాలను సత్తెనపల్లి పెదకూరపాడు పిడుగురాళ్ల ప్రాంతాల్లోని 12 కాలనీలో 5,376 నివాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని అంబటి గుర్తు చేశారు. వారందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 50 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోయినా పేద ప్రజలకు ఉచితంగా హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యంగా సీఎం జగన్ ఆలోచించారని మంత్రి అంబటి పేర్కొన్నారు.