Weather: ఏపీకి వర్ష సూచన .. మూడు రోజులు ఆ ప్రాంతాల్లో జరభద్రం

by srinivas |   ( Updated:2023-07-01 13:08:17.0  )
Weather: ఏపీకి వర్ష సూచన .. మూడు రోజులు ఆ ప్రాంతాల్లో జరభద్రం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీతో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ట్రోపో ఆవరణంలో పడమటి గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ట్రోపో ఆవరణం ఎఫెక్ట్‌తో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అంతేకాదు గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story