Mangalagiri: ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసిన అత్యుత్సాహం

by srinivas |
Mangalagiri: ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసిన అత్యుత్సాహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటంరెడ్డి మెడలో చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం బయట అభిమానులు బాణా సంచా కాల్చారు. అయితే బాణా సంచా కాల్చే క్రమంలో ఇద్దరు గాయపడ్డారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పార్టీ కోసం వచ్చిన వారికి అలా జరగడం నిజంగా చాలా బాధగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story