Mangalagiri: అది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.. నాకు కుదరదు: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2023-05-12 14:49:18.0  )
Mangalagiri: అది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.. నాకు కుదరదు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: కుల రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక కులానికి నాయకుడిని కాదని, మానవతావాదినని, దేశభక్తుడినని తెలిపారు. మంగళగిరిలో పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టిన కులాన్ని కూడా తాను గౌరవిస్తానని, కానీ కుల రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. అజాత శత్రువు అయ్యేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.

నాకు భయాలు లేవు: పవన్

తనకు భయాలు లేవని, సినిమాల ద్వారా పెరిగానని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణ, తమిళనాడు కర్ణాటకతో పాటు మహారాష్ట్ర బోర్డర్‌లోనూ తనకు అభిమానులున్నారన్నారు. బెంగాల్‌కు తనను రమ్మన్నారని తెలిపారు. నన్ను ఒక కులానికి పరిమితం చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులను ఆయన ప్రస్తవించారు. ఆ సమయంలో ఇన్ని పార్టీలు లేవని, అప్పటి రాజకీయాల్లో పగ, ప్రతీకారాలు లేవన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాత్రికి రాత్రి అధికారం దక్కుందనుకోవడం లేదన్నారు. కానీ ఎన్టీఆర్‌కు అది సాధ్యమైందని, తనకు కుదరదని తేల్చి చెప్పారు. తన ఆలోచనంతా ఏపీ అభివృద్ధిపైనే ఉంటుందన్నారు.

నినాదాలతో సీఎం కాలేరు: పవన్

సీఎం పవన్ అంటూ కార్యకర్తలు చేసే నినాదాలపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. నినాదాలతో ముఖ్యమంత్రి కాలేమని, ఓట్లు పడితేనే సీఎం అవుతామని చెప్పారు. ప్రేమ, అభిమానం ఓట్ల రూపంలోకి మారకపోతే అది ప్రయోజనం లేనిదే అవుతందని పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులకు పవన్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

పవన్ కల్యాణ్ చంద్రబాబుకు పాలేరు: మంత్రి జోగి రమేష్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed