సజ్జల రూ.140 కోట్లు తీసుకున్నారు.. జనసేన సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2024-02-01 10:26:58.0  )
సజ్జల రూ.140 కోట్లు తీసుకున్నారు.. జనసేన సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా మందిని సలహాదారులుగా నియమించుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా విషయాల్లో జగన్ సర్కార్ విఫలమైంది. ఈ అంశం చాలా సార్లు కోర్టుల ద్వారా కూడా ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సలహాదారులపై జనసేన నేత నాదెండ్ మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహన్ మాట్లాడుతూ సలహాదారులు, ఉపసలహాదారులను ప్రభుతం నియమించిందని, అసలు వారు సలహాలు ఇస్తున్నారో లేదో అర్ధంకావడం లేదన్నారు. అర్హులనే సలహాదారులుగా నియమిస్తున్నట్లు చెప్పారని. కానీ వారి వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీఎం జగన్‌ను కలవాలంటే నేడు అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి ఉందన్నారు. సీఎం నియమించిన సలహాదారులు సైతం ఆయన్ను కలవలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తీరుతో మంచి సలహాదారులు సైతం రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పారు. సలహాదారుల కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 680 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఒక్క సజ్జలకు రూ.140 కోట్లు వెచ్చించారని నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed