- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: పరాకాష్టకు వైసీపీ దాదాగిరి... పవన్ తీవ్ర ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన బీజేపీ నేత సత్య కుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరి పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని పిలుపునిచ్చారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం అయితే తాము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలని, కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పాలకులు, సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నదీ, ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ..వారిపై దాడులకు పాల్పడుతున్నదీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుందని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Read more :