Amaravati: జైభీమ్ పార్టీకి పోలీసుల షాక్.. పాదయాత్రకు నో పర్మిషన్

by srinivas |   ( Updated:2023-06-17 17:00:51.0  )
Amaravati: జైభీమ్ పార్టీకి పోలీసుల షాక్.. పాదయాత్రకు నో పర్మిషన్
X

దిశ, వెబ్ డెస్క్: జైభీమ్ పార్టీకి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 24న అమరావతిలో చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. తుళ్లూరు నుంచి అంబేద్కర్ సృతి వనం వరకూ పాదయాత్ర చేపట్టాలని జైభీమ్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ డీఎస్పీకి ఆ పార్టీ నేతలు లేఖ రాశారు. అయితే అనుమతి నిరాకరిస్తున్నట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుపై జై భీమ్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. కోర్టు అనుమతితో పాదయాత్ర చేసి తీరతామని చెబుతున్నారు.

Advertisement

Next Story