- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Palnadu: యడవల్లిలో అక్రమ మైనింగ్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా యడవల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా పల్నాడు జిల్లా యడవల్లిలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ ద్వారా కొందరు వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దీంతో పాపయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పాపయ్య తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తున్నారు. ఈ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. నేడు విచారణ చేపట్టింది. యడవల్లిలో జరుగుతున్నమైనింగ్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుతాన్ని ఆదేశించింది.
యడవల్లిలో అక్రమంగా మైనింగ్ కొనసాగుతోందని పిటిషనర్ పాపయ్య ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక కొందరు నేతలున్నారని చెబుతున్నారు. యడవల్లిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా మైనింగ్ చేస్తూ వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం పట్టించుకోవడంవలేదని, అందుకే పిల్ వేసినట్లు పాపయ్య తెలిపారు. ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించిన వివరాలను కోర్టును అందజేసినట్లు పేర్కొన్నారు.