- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amaravathi: R5 జోన్‌లో ప్రమాదం.. 17 మందికి గాయాలు
X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి, నిడమర్రులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆర్5 జోన్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిడమర్రులోని 175 ఎకరాల్లో ప్రభుత్వం భారీ లేఅవుట్ వేసింది. ఇందులో ఇళ్లు నిర్మాణం చేపట్టేందుకు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం టెంట్లు వేశారు. అయితే ఒక్కసారిగా గాలిదుమారం దెబ్బకు ఓ భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో 17 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కాగా ఆర్ 5 జోన్ పరిధిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లేఅవుట్లు వేసే పనులను వేగం చేసింది. శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు గాలి దుమారం కూడా చెలరేగి వాన పడింది.
Advertisement
Next Story