IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2023-10-18 11:15:18.0  )
IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అటు సీఐడీ, ఇటు చంద్రబాబు తరపున వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. అలాగే చంద్రబాబు మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సైతం నవంబర్ 7 వరకు పొడిగించింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఉందని చంద్రబాబు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తీర్పు అనుకూలంగా వస్తే ఐఆర్ఆర్ కేసుకు వర్తిస్తుందని తెలిపారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్‌పైనా హైకోర్టు విచారించింది. పీటీ వారంట్‌పై స్టేను నవంబర్ 7 వరకూ పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed