వారి తీరు చూస్తుంటే చీదరేస్తోంది.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-10-13 11:02:46.0  )
వారి తీరు చూస్తుంటే చీదరేస్తోంది.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్ డెస్క్: నేటి రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆయన దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూసి సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. అందుకే ఓటు వేసి మంచి వ్యక్తుల్ని మాత్రమే ఎన్నుకోవాలని ప్రజలకు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

‘నీతి, నిజాయతీ పరులు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గాయి. నాయకుల మాట తీరు బాగుండటం లేదు. తప్పుడు భాష మాట్లాడే నాయకులను ఎన్నికల్లో ఓడించాలి. నాయకులకు కులం, మతం, నేర మనస్తత్వం, డబ్బు ఎక్కువకావటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. చట్ట సభల్లో వ్యక్తిగత దూషణలు చేయకూడదు. నాయకులు స్థాయికి తగట్లు మాట్లాడాలి. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి. గుణవంతులను గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది.’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.

Advertisement

Next Story