- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌ను ఎందుకు మళ్లీ సీఎం చేయాలి: Kanna Laxminarayana
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ‘వై నీడ్ జగన్’ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ‘వై నీడ్ జగన్’ కార్యక్రమంపై విమర్శలు చేస్తున్నారు. ఏపీకి సీఎం ఎందుకు కావాలో ఒక్క కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో 100 కారణాలు చెప్పొచ్చని, పుస్తకం కూడా ముద్రించవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏపీని తాక్టటు పెట్టినందుకా?.. లేక రాజధాని లేకుండా చేసినందుకా జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి అంటూ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అందరికి తెలుసన్నారు. 2019 నాటికి పోలవరం 75 శాతం పూర్తి అయిందని, మిగిలిన 25 శాతాన్ని ఇప్పటివరకూ ఎందుకు పూర్తి చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు.