ఆమె ఏ కులమో నాకు తెలియదు: హోంమంత్రి అనితపై అంబటి సెటైర్స్

by srinivas |
ఆమె ఏ కులమో నాకు తెలియదు: హోంమంత్రి అనితపై అంబటి సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హోంమంత్రి అనిత(AP Home Minister Anita)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రిపై పోస్టులు పెట్టారని తమ పార్టీ కార్యకర్తలపై ఎస్టీ, ఎస్సీ ఎట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. హోంమంత్రి కులం ఏంటో తనకు తెలియదని, తాను బైబుల్ పట్టుకు తిరుగుతానని ఆమే చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పాపం హోంమంత్రి చేతిలో ఏముందని, అంతా మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) చేస్తున్నారని ఆరోపించారు. మైకు ముందే మాత్రమే అనిత హోంమంత్రి అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. మరి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy)పై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోరని అంబటి ప్రశ్నించారు. తమపై అసభ్య పోస్టులపై వారిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed