- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ambati Rayudu Political Entry: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కీలకంగా వినిపించింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు భారత క్రికెట్ జట్టులో సేవలందించారు. దాదాపు 55 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అలా జరిగినట్టుగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు. దీంతో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది.
అయితే ఆ ప్రచారంపై ఇప్పటివరకూ వరకూ స్పందించని ఆయన తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో భేటీ అయినప్పుడు రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. కానీ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అది ఏ ఫ్లాట్ ఫామ్ అనేది త్వరలో చెబుతానని పేర్కొన్నారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తాననేది ఊహాగానమేనని చెప్పారు. క్షేత్ర సాయిలో ప్రజా, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశారు.