- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tenali: అది అద్భుతం.. సీఎం జగన్‌పై అంబటి రాయుడు ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యావ్యస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు.... వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ కితాబిచ్చారు. ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని రోజులుగా అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్టూరులో వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెనాలి రూరల్ మండలం కొలకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ రైతులతో అంబటి రాయుడు ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం బాటలు వేస్తుందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీనికోసమే ఇప్పటికే రెండు సార్లు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని, తమ తాత నుంచి నేర్చుకున్నట్లు అంబటి రాయుడు తెలిపారు. అందులో భాగంగానే ప్రజలతో మమేకం అవుతూ పర్యటిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపాడు.