Tadepalli: మాజీ మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది: మహిళా కానిస్టేబుల్

by srinivas |   ( Updated:2023-07-01 11:48:42.0  )
Tadepalli: మాజీ మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది: మహిళా కానిస్టేబుల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మహిళా కానిస్టేబుల్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొంత కాలంగా పేర్ని నాని కుమారుడు కిట్టు సహా ఆయన అనుచరులు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. మచిలిపట్నం 7వ డివిజన్ వార్డు సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేసిన తనను కొంత కాలం కిందటే అధికారులు సస్పెండ్ చేశారని చెప్పారు. దీనిపై తాను న్యాయపోరాటం చేశారని చెప్పారు. ఉద్యోగం పునరుద్ధరించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా అధికారులు ఉద్యోగంలోకి చేర్చుకోవడం లేదని ఆమె వాపోయారు.

ఉద్యోగం పేపర్ రూపంలోనే ఉందని తినడానికి మాత్రం లేదన్నారు. తన జీతం రూ. 6 లక్షల దాకా ఆగపోయిందన్నారు. తన ఉద్యోగాన్ని నామరూపాలు లేకుండా చేశారని అన్నారు. త్రెట్ ఉందని పోలీసు అధికారులు తనకు ఇదివరకే సూచించారని తెలిపారు. ఈ వ్యవహారంపై చెబుదామంటే.. ఎమ్మెల్యే పేర్ని నాని అపాయింట్మెంట్ దొరకడం లేదని ఆమె అన్నారు. సీఎం జగన్ తన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story