Satulur: పంట పొలంలో రైతు సజీవదహనం

by srinivas |
Satulur: పంట పొలంలో రైతు సజీవదహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంట పొలంలో ఎండుగడ్డిని తగలబెడుతూ ఆ మంటలు అంటుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో వెలుగులోకి వచ్చింది. బండారుపల్లి వెంకటేశ్వర్లు(70) అనే రైతు తన పొలంలో మొక్కజొన్న పంటను వేశారు. పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్ధాలు పొలంలోనే ఉండటంతో వాటిని తగలబెట్టారు.

అయితే ఆ మంటలకు గాలి తోడైంది. దీంతో పక్కనే ఉన్న తన సోదరుడి పొలంలోని పంటకు వ్యాపించింది. దీంతో ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నించగా కింద పడిపోయారు. దీంతో మంటలు వెంకటేశ్వర్లుని చుట్టుముట్టాయి. మంటలు చుట్టుముట్టడంతో వెంకటేశ్వర్లు సజీవ దహనమయ్యారు. వెంకటేశ్వర్లు సజీవ దహనంతో కుటుంబంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story