- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP NEWS: అత్యవసరం అయితేనే బయటకు రండి..!
దిశ, డైనమిక్ బ్యూరో: అత్యవసర పనులు ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. ఎండ తీవ్రత పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం అత్యధికంగా ఉంటుందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని తెలియజేశారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు... విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36°C -40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలియజేశారు.
వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. ఇకపోతే మంగళవారం 40 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో మంగళవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8°C, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7°C, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13మండలాల్లో 46డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42°C -44°C ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
Also Read..
టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందిస్తాం: మంత్రి బొత్స