- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly: ఆ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి... Cm Jagan కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజి సంస్థ చేపట్టిందని.. ఆ సంస్థ ప్రతినిధి వాసుదేవ్ మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మధ్య డీల్ జరిగిందని ఆయన ఆరోపించారు. షాపూర్ జీ పల్లోంజీ అనే సంస్థపై 2019లో ఐటీ రైడ్స్ జరిగాయని గుర్తుచేశారు. 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ రైడ్స్ జరిగాయని జగన్ తెలిపారు. ఫైనల్‌గా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు పంపించిందని సీఎం జగన్ వెల్లడించారు.
ఆ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి...
‘‘ప్రజా ధనాన్ని తనకు కావాల్సిన వారికి చంద్రబాబు కట్టబెట్టారు. ఆర్వీ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరిగా ఆ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి. ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు. ఈ అంశాలన్నీ ఐటీ అధికారుల నివేదికలో ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం ద్వారా కూడా అవినీతికి పాల్పడ్డారు. హైకోర్టు నిర్మాణంలోనూ అవినీతి జరిగింది.’’ అని జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు.