Cm Jagan కార్యాలయానికి ఐఏఎస్ అధికారుల క్యూ

by srinivas |   ( Updated:2022-12-01 15:17:15.0  )
Cm Jagan కార్యాలయానికి ఐఏఎస్ అధికారుల క్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కిటకిటలాడుతుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కోసం క్యూ కట్టారు. నూతన సీఎస్ మొదలుకుని రిటైర్ అయిన సీఎస్ వరకు ఒక్కొక్కరూ సీఎం వైఎస్ జగన్‌ను ప్రసన్నం చేసేందుకు చేరుకున్నారు. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఐఏఎస్ అధికారుల తాకిడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి తొలుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సీఎంవోలోకి చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి పూనంమాల కొండయ్య సైతం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఇకపోతే సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ పూనం మాలకొండయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా డా.సమీర్ శర్మ

మాజీ సీఎస్ డాక్టర్‌ సమీర్‌ శర్మ సైతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టూ చీఫ్‌ మినిస్టర్‌గా ప్రభుత్వం ఆయనకు నూతన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సీఎస్‌గా రిటైర్ అయిన అనంతరం మరో అవకాశం కల్పించడంతో ఆయన కృతజ్ఞతలు తెలియాజేశారు. సీఎస్‌గా అవకాశం కల్పించడమే కాకుండా రెండుసార్లు పదవీ కాలాన్ని పొడిగించిన విషయాన్ని గుర్తు చేసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed