ఏపీలోనూ జంట నగరాలు..సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 15:26:17.0  )
ఏపీలోనూ జంట నగరాలు..సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఏపీ బ్యూరో:నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు - విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు ధీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

గుంటూరు కార్పొరేషన్‌లో 39 గ్రామాల విలీనం..

గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి ఇప్పటికి 150 ఏళ్లు అవుతోంది. ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్‌లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు.

గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు..

-మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు

-ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్

-చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం

-ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం

-తాడికొండ మండలంలోని లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు

-వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల

-పెదకాకాని మండలంలోని రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకటకృష్ణాపురం

-గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు, మల్లవరం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులనాయుడు పాలెం

Advertisement

Next Story

Most Viewed