ఏపీ రాజధానిని తేల్చేసిన చంద్రబాబు.. ఎన్డీయే పాలసీ అంటూ క్లారిటీ

by srinivas |
ఏపీ రాజధానిని తేల్చేసిన చంద్రబాబు.. ఎన్డీయే పాలసీ అంటూ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati)నేనని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తేల్చి చెప్పారు. ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతే రాజధాని అని, విశాఖ ఆర్థిక రాజధాని(Financial capital) అని, కర్నూలులో హైకోర్టు బెంచ్(High Court Bench) ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే పాలసీ(NDA policy) ఒకే రాజధాని అని 'సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా 2014‌లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ(AP Reorganization) జరిగిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణకు హైదరాబాద్ రాజధాని కాగా.. ఏపీకి అమరావతిని రాజధాని నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. ఆ మేరకు ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే 2019లో ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఏపీకి అప్పటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అమరావతి శాసనరాజధాని అని, విశాఖ రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని అని అంటూ సీఎం ప్రకటించారు.

అయితే టీడీపీ, జనసేన, బీజేపీ(TDP, Janasena, BJP) వ్యతిరేకించాయి. ఏపీకి రాజధాని అమరావతినేనంటూ స్పష్టం చేశాయి. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం(YS Jagan Govt) విశాఖను రాజధానిగా ప్రకటించడంతో పాటు ఆ మేరకు అడుగులు వేసింది. ఏపీలో ఇటీవల జరిగిన జగన్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీకి రాజధాని అమరావతినేనని ప్రకటించింది. రాజధాని అమరావతి నుంచే పాలన సాగిస్తోంది. తాజాగా మూడు రాజధానుల ప్రస్తావన రావడంతో ఏపీ కేపిటల్‌పై సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు.

Advertisement

Next Story