- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur: వైసీపీ ఐప్యాక్ సభ్యుల కలకలం.. కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఐ ప్యాక్ సభ్యులు పొలిటికల్ సలహాలే కాదు.. కౌన్సిల్ సమావేశాల్లోకి వచ్చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నదంతా గమనించి రిపోర్టు తయారు చేస్తున్నారు. అంతేకాదు ఆ రిపోర్టును వైసీపీ అధిష్టానికి పంపుతునట్లు తెలుస్తోంది. అయితే ప్రజా సమస్యలపై చర్చించే కౌన్సిల్ సమావేశాల్లోకి రావడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో ఆ సమావేశాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు.
అయితే సమావేశం జరగుతుండగా వైసీపీకి చెందిన ఐప్యాక్ సభ్యులు కనిపించారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బయటి సభ్యులు కౌన్సిల్ సమావేశంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అయితే ఐప్యాక్ సభ్యులకు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు కూడా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్దపెద్దగా అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది. ఈ ఘటనతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం పరిస్థితి నెలకొంది. దీంతో ఇరువర్గాలను ఎమ్మెల్యే మద్దాల గిరి అడ్డుకుని ఐప్యాక్ సభ్యులను కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు పంపివేశారు.
అయితే ఐప్యాక్ సభ్యులు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలోకి రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలోకి ప్రైవేటు వ్యక్తులకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అధికారం ఉంది కాదా అని వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్‌ను ఐప్యాక్ సభ్యుల అడ్డాగా మార్చారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు.