కనీసం మీరైనా న్యాయం చేయండి: ఏపీ ఉద్యోగుల జేఏసీ

by srinivas |   ( Updated:2024-11-03 12:39:48.0  )
కనీసం మీరైనా న్యాయం చేయండి: ఏపీ ఉద్యోగుల జేఏసీ
X

దిశ, వెబ్ డెస్క్: తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(AP Employees JAC Chairman Bopparaju Venkateshwarlu) అన్నారు. తమ సమస్యలపై అమరావతి(Amaravati)లో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన రూ. 25 వేల కోట్ల బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-19లో మాదిరిగా ఇప్పుడు పునరుద్ధరించాలన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఉద్యోగులుగా వరదలు, తుఫాను, కరోనా వచ్చినా ప్రజలకు అండగా నిలిచామన్నారు. కరోనా సమయంలో రెండు రోజలు వేతనాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. విజయవాడ వరద బాధితులకు ఒక రోజు వేతనం ఇచ్చామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.

రిటైర్డ్ ఎంప్లాయిస్‌కూ బకాయిలు మొత్తం ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీపీఎఫ్‌లు విడుదల చేయాలని, పోలీసులకు, ఉద్యోగులకు సరెండర్ లీవులు ఇవ్వాలని కోరారు. ‘‘11 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. తక్షణమే జీతభత్యాలు పెంచాలి. ప్రభుత్వ పథకాలను వర్తింపు చేయాలి. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు రం నెరవేర్చాలి. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వమైనా న్యాయం చేయాలి.’’ అని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

Advertisement

Next Story

Most Viewed