రైతులకు గుడ్ న్యూస్... విత్తనాల సరఫరాపై సీఎం జగన్ కీలక ప్రకటన

by srinivas |
రైతులకు గుడ్ న్యూస్... విత్తనాల సరఫరాపై సీఎం జగన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఉండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వారికి సబ్బిడీపై విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. పంటల రక్షణతో పాటు పరిహారం అందిస్తామని, అటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్.. బాధితులకు సకాలంలో సాయం అందించాలని ఆదేశించారు. వర్షాలతో దెబ్బ తిన్న ఇళ్లకు రూ. 10 వేలు అందించాలని, పునరావసాల్లో తలదాచుకుని.. తిరిగి ఇంటికి వెళ్లే వాళ్లకు కూడా సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులకు చేపట్టాలని సూచించారు. పొలాల్లో నీటిని త్వరగా తొలగించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను త్వరగా బాగు చేసి రవాణా సదుపాయాన్ని యధాతధం చేయాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు మొదలు పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed