Chandrababu Naidu : నవయుగ ధర్మరాజు చంద్రబాబు: మధు పండిత్

by srinivas |   ( Updated:2024-07-13 07:30:04.0  )
Chandrababu Naidu : నవయుగ ధర్మరాజు చంద్రబాబు: మధు పండిత్
X

దిశ, వెబ్ డెస్క్: నవయుగ ధర్మరాజు సీఎం చంద్రబాబు నాయుడు అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ అన్నారు. గుంటూరు కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుపండిత్ మాట్లాడుతూ పాండవులు నడిచిన అమరావతిలో సీఎం చంద్రబాబు నవయుగ ధర్మరాజు అని కొనియాడారు. ఆ రాజులానే రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే సుపరిపాలన కొనసాగుతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతికి వెంకన్న, దుర్గమ్మ ఆశీస్సులు కొనసాగాలని మధు పండిత్ ఆకాంక్షించారు. తిరుమలలో ప్రక్షాళన చేపట్టి భక్తుల మనోభావాలను కాపాడుతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి నిలవాలని, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెలుగొందాలని మధు పండిత్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story