గుంటూరులో బోర్డు తిప్పేసిన ప్రైవేట్ కంపెనీ.. అధిక వడ్డీ ఆశ చూపి

by Disha News Desk |
గుంటూరులో బోర్డు తిప్పేసిన ప్రైవేట్ కంపెనీ.. అధిక వడ్డీ ఆశ చూపి
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది, అధిక వడ్డీ ఆశ చూపి ఓ మహిళ నుంచి రూ.60 లక్షలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. తమ కంపెనీలో పెట్టుబడి పెట్టండి సంవత్సరంలో రెట్టింపు అంటూ బ్రాడిపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రచారం చేసింది. అది నిజమని నమ్మిన ఓ మహిళ గత ఏడాది రూ.60 లక్షలు ఇచ్చింది. అయితే అదనపు డబ్బులు రాకపోగా ఇచ్చిన సొమ్ము రావడం లేదని భావించింది. దాంతో కంపెనీ ప్రతినిధులను నిలదీసేందీయాలని నిర్ణయింయుకుని వెళ్లగా ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో తాను మోసపోయానని మహిళ గ్రహించింది. దీంతో బాధితురాలు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story