Guntur: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2024-07-21 17:00:47.0  )
Guntur: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజనం సమయంలో మెస్ నిర్వాకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మెస్‌లో వడ్డించాల్సిన భోజనం బయటకు పోవడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెస్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భోజనాన్ని ఎందుకు బయటకు పంపుతున్నారంటూ వాగ్వాదానికి నిలదీశారు. ఆదివారం అయినా సరే భోజనం వడ్డించాలని.. కానీ నిర్వాహకులు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం బయటకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వీసీకి సోమవారం ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ మెస్‌లో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Next Story