Guntur: నందిగం సురేశ్ డిశ్చార్జి.. జైలుకు తరలింపు

by srinivas |   ( Updated:2024-10-11 10:39:15.0  )
Guntur: నందిగం సురేశ్ డిశ్చార్జి.. జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Former YCP MP Nandigam Suresh) గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం(Telugu Desam Party Office)పై దాడి, వెలగపూడి వృద్ధురాలి హత్య కేసులో నందిగం సురేశ్ రిమాండ్‌లో ఉన్నారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని జైలు అధికారులకు నందిగం చెప్పడంతో ఆయనను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి(Guntur GGH Hospital)కి తరలించారు. అక్కడ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో జీజీహెచ్ నుంచి నందిగంను జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద నందిగం సురేశ్‌ను చూసిన ఆయన భార్య బేబిలత కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వద్దకు వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. నందిగం సురేశ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలకు అభివాదం చెబుతూ పోలీసులతో కలిసి సురేశ్ అక్కడ నుంచి జైలుకు వెళ్లిపోయారు.

Advertisement

Next Story