- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP:‘గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’..వైఎస్ షర్మిల డిమాండ్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో త్వరలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 1 లక్ష 48 వేల 881 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 91 వేల 463 మంది పరీక్ష రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4 వేల 496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు 1:100 చొప్పున ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థుల పక్షాన కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్-2, DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లు, గ్రూప్-1 మెయిన్స్‌కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబును కోరారు. గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండటం,కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్-1 సిలబస్‌ను రివిజన్ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని తెలిపారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాధ్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామని వైఎస్ షర్మిల ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.