బ్రేకింగ్: AP గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

by Satheesh |
బ్రేకింగ్: AP గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం గవర్నర్‌ తీవ్రమైన కడుపు నొప్పితో భాదపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్‌కు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు గవర్నర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అల్ట్రా సౌండ్ సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. గవర్నర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story