‘రియల్’ దందా.. ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణ

by samatah |
‘రియల్’ దందా.. ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణ
X

దిశ, ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం పట్టణంలో జోరుగా రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలచి కన్వర్షన్ అనుమతలు లేకుండా విక్రయాలు జరుపుతున్నారు. కొందరు నాయకులకు అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుల్లల చెరువు రోడ్డు లోని పెట్రోల్ బంక్ పక్కన కులుకులరోడ్డు చివరి ప్రాంతంలో భూముల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. రాళ్లవాగును పూడ్చి మరి ఈ దందా కొనసాగిస్తున్నారు. తెలియక కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అడ్డగోలు భూ విక్రయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story