తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం అదే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

by Satheesh |   ( Updated:2023-01-27 10:24:42.0  )
తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం అదే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు తారకరత్నను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

గుండెకు రక్త ప్రసరణ జరిగే నాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చిందని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నామని పేర్కొన్నారు. రక్త నాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్లే స్ట్రోక్ వచ్చిందని.. ప్రస్తుతానికి తారకరత్నకు డాక్టర్లు ఎలాంటి స్టంట్‌లు వేయలేదని తెలిపారు. పీఈఎస్ ఆసుపత్రిలో తారకరత్నకు యోంజియోగ్రామ్ పూర్తైనట్లు చెప్పారు. కాగా, తారకరత్నను బెంగళూరుకి తరలించేందుకు బాలకృష్ణ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: తారకరత్న కోలుకుంటున్నారు: Balakrishna

Advertisement

Next Story