- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన!

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ (Super Six) పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సంక్రాంతి (Sankranti) నుంచి ఆర్టీసీ (RTC) బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లుగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు (MLA Yarlagadda Venkata Rao) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల భవిష్యత్తును దృష్టి పెట్టుకుని వారు నష్టపోకుండా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించనుందని పేర్కొన్నారు.
కాగా, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే.. పెరిగే రద్దీపై ఇప్పటికే ఆర్టీసీ (RTC) అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ముఖ్యంగా బస్సులు కోరత లేకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బస్సుల కోనుగోలు కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ సంకాంత్రి (Sankranthi)కి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించనుంది.