- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: మహిళలకు శుభవార్త.. ఇకపై ప్రతినెల అకౌంట్ లోకి డబ్బులు..
దిశ డైనమిక్ బ్యూరో: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మహిళకు శుభవార్త చెప్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ లో మహిళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షల తెలియ చేశారు. అలానే దేశంలో మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం మన ఇందిరమ్మ అంటూ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కొనియాడారు.
అలానే ప్రతి పేదింటి మహిళకు సాధికారత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభియం పథకం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళలకు నెలకు 5వేల రూపాయలు ఇవ్వనున్నామని వెల్లడించారు.
ఇక మహిళా దినోత్సవం రోజున ఇదే మహిళలకు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆమె నేడు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం పెద్దలతో మాట్లాడనున్నారు.