Godavari river:పర్యాటకులకు గుడ్ న్యూస్.. గోదావరినదిపై ‘ఫ్లోటింగ్‌ రెస్టారెంట్’

by Jakkula Mamatha |
Godavari river:పర్యాటకులకు గుడ్ న్యూస్.. గోదావరినదిపై ‘ఫ్లోటింగ్‌ రెస్టారెంట్’
X

దిశ, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలోని 6 ప్రముఖ పుణ్య క్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక పర్యాటక బస్సులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్ వద్ద శనివారం ప్రారంభించారు. 20 మంది యాత్రికులతో బయలుదేరిన ఈ బస్సును ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఫోన్ చేసి యాత్రికులు ఈ బస్సు సీటును ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని పర్యాటక శాఖాధికారులు తెలిపారు.

గోదావరిపై ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌..

ఆహ్లాదకర వాతావరణంలో గోదారి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ సిద్దమైంది. పర్యాటకశాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో గోదావరిపై తొలిసారిగా పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది. రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయ స్వామి ఆలయం సమీపంలోని లాంచీల రేవు నుంచి ఏపీ టూరిజం బోట్‌ల ద్వారా ప్రయాణించి ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27న ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ దీనిని ప్రారంభిస్తారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కిట్టీ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు అనువుగా ఈ రెస్టారెంట్‌ ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed