Good News:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-03 09:11:46.0  )
Good News:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను పీహెచ్ సీలతో పాటు ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం(డిసెంబర్ 4) నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులకు చివరి గడువు ఈ నెల 13 అని తెలిపింది. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపికైన తర్వాత చెల్లించే జీతభత్యాలు ఇతరత్రా పూర్తి వివరాల కోసం వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్https://apmsrb.ap.gov.in/msrb/ సందర్శించాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed