పదవ తరగతి విద్యార్థులకు మరో శుభవార్త! ఏది ఎక్కువ రాస్తే దానికే మార్కులు..!

by Anjali |   ( Updated:2023-04-13 14:55:22.0  )
పదవ తరగతి విద్యార్థులకు మరో శుభవార్త! ఏది ఎక్కువ రాస్తే దానికే మార్కులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి. అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. టెన్త్ ఎగ్జామ్స్ పబ్లిక్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. అలాంటి వారికి.. రాసిన వాటిల్లో ఏ ప్రశ్నకు ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను కలపనున్నారు. అలానే తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేస్తారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ విడుదల చేసింది.

ఈ నెల(ఏప్రిల్) 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అనంతరం మరుసటి రోజు ఏప్రిల్ 19 నుంచి మూల్యాంకనం జరగనుంది. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల మూల్యాంకన జరగనుంది. అందుకు రాష్ట్ర, జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు.

Also Read...

10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే

Advertisement

Next Story

Most Viewed